- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి పొన్నం క్షమాపణ చెప్పాలి
సహచర మంత్రి అని చూడకుండా మంత్రి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్ వెంటనే బేషరతుగా

దిశ, పెగడపల్లి : సహచర మంత్రి అని చూడకుండా మంత్రి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తడగొండ తిరుపతి డిమాండ్ చేశారు. మండల కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ, మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అట్టి వ్యాఖ్యలు చేసిన సమయంలో పక్కనే ఉన్న మరొక ఎస్సీ మంత్రి వివేక్ స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఎస్సీ మంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సంధి మల్లారెడ్డి,సింగిల్ విండో డైరెక్టర్ తోట మల్లేశం,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాట్ల విజయ్ భాస్కర్, చెట్ల కిషన్,నాయకులు పూసల తిరుపతి,కడారీ తిరుపతి,ఆకుల విష్ణు,తడగొండ రాజు,బొడ్డు రమేష్,వంశీధర్ రావు,మందపల్లి అంజయ్య,పవన్ రెడ్డి,బుర్ర సంపత్,మొదుంపల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.






