సర్పంచ్ భర్త పై చర్యలు తీసుకోవాలి : బాధితుడు అడ్డూరి సంప‌త్

by Ratna Kumari |   (  Updated:2026-03-05 12:25:44  IST  )

త‌న‌పై అక్ర‌మంగా రూ.2వేలు వ‌సూలు చేశార‌ని.. చ‌దువును వెట‌కారం చేసి అవ‌మానించార‌ని ఓ బాధితుడు వాపోయాడు.

సర్పంచ్ భర్త పై చర్యలు తీసుకోవాలి : బాధితుడు అడ్డూరి సంప‌త్
X

దిశ‌, మంథ‌ని : పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని మండ‌లం గ‌ద్ద‌ల‌ప‌ల్లి(ధ‌ర్మారం) గ్రామానికి చెందిన అడ్డూరి సంప‌త్ అనే వ్య‌క్తి పై స‌ర్పంచ్ భ‌ర్త పంచాయ‌తీ పెట్టి రూ.రెండు వేలు అక్ర‌మంగా వసూలు చేసి క్ష‌మాప‌ణ చెప్పించి త‌న‌ను అవ‌మానానికి గురి చేసిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. గురువారం మంథ‌నిలోని ప్రెస్ క్ల‌బ్ లో బాధితుడు సంప‌త్ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌ర్పంచ్ గా పోటీ చేసినందుకు చ‌దువుకున్న వ్య‌క్తికి ఓటు వేయాల‌ని.. గ్రామంలో ప్ర‌చారం చేశాన‌ని తెలిపారు. దీంతో త‌న‌పై క‌క్ష క‌ట్టి త‌న‌ను ఊరు ప్ర‌జ‌ల ముందుకు పిలిపించి త‌న‌ను, త‌న చ‌దువు గురించి అవ‌మాన‌ప‌ర‌చ‌డ‌మే కాకుండా విద్య‌ను వెట‌కారంగా చేసి మాట్లాడార‌ని ఆరోపించారు.


త‌న‌తో క్ష‌మాప‌ణ చెప్పించి అక్ర‌మంగా జ‌రిమానా విధించి త‌న కిరాణ షాపును తొల‌గించాల‌ని ఆదేశించార‌ని వాపొయాడు. గ్రామంలో ఉన్న స‌ర్పంచ్ గ్రామ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సింది పోయి గ్రామంలో వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌ను ప్రోత్స‌హిస్తూ పంచాయ‌తీల‌కు కార‌ణ‌మ‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. గ్రామంలో గుడుంబా బెల్ట్ షాపుల్లో మ‌ద్యం విచ్ఛ‌ల‌విడిగా ఏరులై పారుతుంది. యువ‌కులు మ‌ద్యానికి బానిసై మ‌త్తుకు బానిసై రోడ్ల మీద తిరుగుతున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయాడు. ఇప్ప‌టికైనా స‌ర్పంచ్ వీటిపై దృష్టి పెట్టి గ్రామాభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు బాధితుడు సంప‌త్.

Next Story