- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గేదెను కరిచిన వీధి కుక్క.. వారంతా ఆసుపత్రిలో క్యూ..!
by Ratna Kumari |
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలో ఓ పాడి గేదెను వీధి కుక్క కరవడంతో గేదెకు రేబిస్ సోకి మరణించింది. గేదె పాలు తాగిన వారందరూ భయాందోళనకు గురై ఆసుపత్రిలో క్యూ కట్టారు.

X
దిశ, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలో ఓ పాడి గేదెను వీధి కుక్క కరిచింది. అయితే ఆ గేదె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆ గేదెకు రేబిస్ వ్యాధి సోకి మరణించిందని గ్రామస్తులు భావించారు. ఆ గేదె పాలు తాగిన కొంత మంది గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వారి ఆరోగ్యంలో కాస్త మార్పులు సంభవించడంతో హుటాహుటిన మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ముందస్తు యాంటీ రేబిస్ టీకా వేయించుకునేందుకు ఆసుపత్రి వద్ద క్యూ కట్టారు. ఇది చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురవుతుండటం విశేషం.
Next Story






