క‌ళ్ల‌లో కారం కొట్టి మ‌హిళా మెడలో గొలుసు చోరీ

by Ratna Kumari |

క‌ళ్ల‌లో కారం కొట్టి ఓ మ‌హిళా మెడలో గొలుసు చోరీ చేసిన ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వీర్న‌ప‌ల్లి మండ‌లం బంజేరు గ్రామంలో చోటు చేసుకుంది.

క‌ళ్ల‌లో కారం కొట్టి మ‌హిళా మెడలో గొలుసు చోరీ
X

దిశ‌, ఎల్లారెడ్డిపేట : క‌ళ్ల‌లో కారం కొట్టి ఓ మ‌హిళా మెడలో గొలుసు చోరీ చేసిన ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వీర్న‌ప‌ల్లి మండ‌లం బంజేరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బంజేరు గ్రామానికి చెందిన గుగులోతు హంసి అనే మ‌హిళా ఇవాళ ఉద‌యం ఇంటి బ‌య‌ట ప‌నులు చేసుకుంటుండ‌గా.. గుర్తు తెలియని దొంగ‌లు ఆమె క‌ళ్ల‌లో కారం కొట్టి ఆమె మెడ‌లోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. ముగ్గురు అనుమానితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు స‌మాచారం.

Next Story