- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో ప్రాణం తీసిన నిందితుడికి 8 ఏళ్ల జైలు
మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక యువకుడి మృతికి కారణమైన కేసులో నిందితుడికి మరంపెల్లి నవీన్ కుమార్‌కు 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి రత్న పద్మావతి తీర్పునిచ్చారు.

దిశ, జగిత్యాల టౌన్ : మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక యువకుడి మృతికి కారణమైన కేసులో నిందితుడికి మరంపెల్లి నవీన్ కుమార్‌కు 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి రత్న పద్మావతి తీర్పునిచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇచ్చినందుకు బైక్ యజమాని మరంపెల్లి అంజయ్యకు రూ.20వేలు భారీ జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. 2022 ఆగస్టు 9న మెట్‌పల్లి మండలం వెంపేట గ్రామానికి చెందిన నవీన్ కుమార్ మద్యం సేవించి, తన బంధువు అంజయ్యకు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను తీసుకొని అతివేగంగా యూసుఫ్‌నగర్ క్రాస్ రోడ్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టాడు. గుండంపల్లికి చెందిన శివరాత్రి సాగర్ (22) అక్కడికక్కడే మృతి చెందగా.. అతని తల్లి తీవ్రంగా గాయపడ్డారు. మల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన కోర్టు తీర్పు చెప్పింది.






