గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్ల నిధులు విడుదల : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

by Ratna Kumari |

గోదావరి పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు తొలి విడత విడుదల చేసిందని, పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అవసరమయ్యే పుష్కర ఘాట్లు, రోడ్లు, పా రుశుధ్య మంచినీటి వసతులు దేవాలయాల పునర్ నిర్మాణం చేపడతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిఅడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు

గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్ల నిధులు విడుదల :  మంత్రి అడ్లూరి లక్ష్మణ్
X

దిశ, వెల్గటూర్ : గోదావరి పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు తొలి విడత విడుదల చేసిందని, పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అవసరమయ్యే పుష్కర ఘాట్లు, రోడ్లు, పా రుశుధ్య మంచినీటి వసతులు దేవాలయాల పునర్ నిర్మాణం చేపడతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిఅడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి పుష్కరాల కోసం చేపట్టే పనుల గురించి చర్చించారు. వెల్గటూర్ నుండి రాజక్క పల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. వెల్గటూర్ లో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయంను పరిశీలించారు. అయ్యప్ప దేవాలయం వద్ద పర్యాటకులను ఆకర్షించే విధంగా బోటింగ్ సౌకర్యం కల్పించాలని మంత్రి సూచించారు.

కోటిలింగాల నుంచి పాసిగాం వరకు నూతనంగా డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ధర్మపురి పట్టణంలో మంగళ్ ఘాట్ నుండి బ్రాహ్మణ సంఘం, పోచమ్మ గుడి మీదుగా దమ్మన్నపేట రోడ్డుకు కలిసే విధంగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మంత్రి సూచించారు. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వ కాలంలో ఆధారబాదరగా పుష్కరాల పనులు ప్రారంభించి నాణ్యతకు తిలోధకాలు ఇచ్చారని మంత్రి విమర్శించారు.. పుష్కరాల రోజులు ప్రారంభం సమయంలో పనులు నడవడంతో పుష్కరాలకు వచ్చిన భక్తుల ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి ఆరోపించారు.ప్రస్తుతం ఏడాది ముందే పనులు ప్రారంభించి 2027 మార్చి వరకు పుష్కరాల పనులను పూర్తి చేస్తామన్నారు.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి భక్తులకు భరోసా కల్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ధర్మపురి నియోజకవర్గానికి పుష్కరాల సందర్భంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తానని ఇచ్చిన మాట ప్రకారం పుష్కరాలకు ప్రత్యేక నిధులు తీసుకువస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.

Next Story