- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంటోళ్ల ప్రజా బాట.. మెరుగైన విద్యుత్ సేవల వైపు టీజీఎస్పీడీసీఎల్ వినూత్న నిర్ణయం
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) తన పరిధిలోని నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కరెంటోళ్ల ప్రజా బాట పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తన పరిధిలోని నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కరెంటోళ్ల ప్రజా బాట పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళ, గురు, శని వారాల్లో సీఎండీ నుండి ఆర్టిజన్ స్థాయి వరకు గల సిబ్బంది, అధికారులు నేరుగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నెట్వర్క్ తనిఖీలు చేస్తూ, వినియోగదారుల నుంచి సలహాలు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీన డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించగా.. గురువారం నుంచి ప్రజా బాట ప్రారంభమైంది.
ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్తారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల విద్యుత్ సమస్యలు సిబ్బంది, అధికారుల దృష్టికి వస్తుంది. అధికారులు వారంలో మూడు రోజుల పాటు ప్రజా బాట కోసం వస్తారని తెలిసి ప్రజలు సైతం తమ సమస్యలు చెప్పేందుకు సిద్ధంగా ఉంటారు. ఫలితంగా దీర్ఘకాలికంగా ఉన్న విద్యుత్ సమస్యలతో పాటు అప్పటికప్పుడు వచ్చే సమస్యలు సైతం పరిష్కారమవుతాయి. కొన్ని వేల కి.మీ ఎల్టీ లైన్లు, 11 కేవీ, 33 కేవీ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్, ఏబీ స్విచ్ వంటి విద్యుత్ పరికరాలను పరిశీలిస్తారు, ఏదైనా సమస్య ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తారు. దీని వలన విద్యుత్ సరఫరా నాణ్యత మరింత మెరుగుపడుతుంది. దీనికి తోడు ఫిర్యాదులు తగ్గడంతో పాటు నెట్‌వర్క్ బలపడి విద్యుత్ నష్టాలు తగ్గుతాయి.
టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
నిర్దేశించిన మేరకు వారంలో మూడు రోజుల పాటు ఉదయం 8:00 గంటల నుండి 10:30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో సీఎండీ నుండి ఆర్టిజన్ స్థాయి వరకు సుమారు 9,500 మంది సిబ్బంది పాల్గొంటారు. అందులో డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్‌మెన్, జేఎల్ఎం, తదితరులు పాల్గొని నెట్వర్క్ ను పరిశీలిస్తారు. నేరుగా వినియోగదారులతో మాట్లాడి వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తారు. ప్రజాబాటలో నమోదయిన ఫిర్యాదులను, సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తాం.. అని ఫరూఖీ తెలిపారు.






