- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్వకుంట్ల కవిత కాదు.. దేవనపల్లి కవిత అట! ఇంటి పేరు మార్చిన బీఆర్ఎస్ సోషల్ మీడియా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురిగా ఆమె.. పెళ్లి అయిన కూడా ఇంటి పేరు మాత్రం కల్వకుంట్ల అని పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. వివాహం అయిన తర్వాత చాలా మంది మహిళలు తన భర్త ఇంటి పేరును పెట్టుకుంటారు. కొంత మంది మాత్రం తన తండ్రి ఇంటి పేరు పెట్టుకోవడానికి ఇష్టపడుతారు. అయితే, బీఆర్ఎస్ నేతలపై చేసిన వ్యాఖ్యల వల్ల ఎమ్మెల్సీ కవితపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీస్‌ల్లో ఆమె పోస్టర్లు, బ్యానర్లు తీసివేశారు. ఇప్పటికే ఆమె ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫెస్‌బుక్ తదితర సోషల్‌మీడియా ఖాతాలను పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు అన్‌ఫాలో చేశారు. ఈ క్రమంలోనే కవిత కల్వకుంట్ల అనే ఇంటి పేరును పెట్టుకోవడంపై పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సస్పెండ్ కాకముందు వరకు కల్వకుంట్ల కవిత అని.. సస్పెన్షన్ అనంతరం దేవనపల్లి కవిత (Devanapalli Kavitha) అని అంటున్నారు. కొత్తగా బీఆర్ఎస్‌కు దేవనపల్లి కవిత వర్గం నుంచి ఫేక్ సమస్య మొదలైంది అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ న్యూస్ @BRSParty_News ట్వీట్ చేసింది. ‘ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఫేక్ న్యూస్ బెడద ఉండేది. ఇప్పుడు కొత్తగా దేవనపల్లి కవిత వర్గం నుంచి ఫేక్ సమస్య మొదలైంది. 5 ఏళ్ల క్రితం తెలంగాణ భవన్‌లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వీడియోను ఈ రోజు జరిగింది అంటూ ప్రచారం చేస్తున్న జాగృతి అల్లరి మూకలు’ అని బీఆర్ఎస్ పార్టీ న్యూస్ పోస్ట్ చేసింది. ఇక నుంచి కవిత ఇంటి పేరు కల్వకుంట్ల కవిత కాదు.. దేవనపల్లి అని నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు.
https://x.com/BRSParty_News/status/1962849576509186218






