- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ 2.0 పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ( YS Jaganmohan Reddy) గులాబీ పార్టీ ( BRS) ఎమ్మెల్సీ కల

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ( YS Jaganmohan Reddy) గులాబీ పార్టీ ( BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని... ఆయన మంచి ఫైటర్ అంటూ ప్రశంసించారు కవిత. జగన్మోహన్ రెడ్డి 2.0 ( Jagan 2.o ) తనకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడని... ఆయన ప్రతిపక్ష నాయకుడిగా.. మంచి ఫైట్ చేస్తున్నాడని కూడా కొనియాడారు.
తాజాగా ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, ప్రస్తుతం గులాబీ పార్టీ ఎదుర్కొంటున్న పెను సవాళ్లు, అటు ఏపీ రాజకీయాలను కూడా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడని చురకలు అంటించారు కవిత.
మొదట్లో లెఫ్టిస్ట్... అంటూ ఇప్పుడు బిజెపి ( BJP ) చెంతన చేరాడని మండిపడ్డారు. అదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి మంచి పోరాటం చేస్తున్నాడని.. ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయని స్పష్టం చేశారు కవిత. తనకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్ (KCR ) అని... కాంగ్రెస్ లో సోనియా గాంధీ ( Sonia Gandhi ) మంచి నాయకురాలని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గులాబీ పార్టీ దూకుడుగా వెళుతోందన్నారు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha).
YS Jagan is a very good fighter..
— Telugu Feed (@Telugufeedsite) April 10, 2025
His Face the Toughest Times of his Life@ysjagan 2.0 I am loving it pic.twitter.com/mWiVl9Ojxz






