- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపించండి
ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కవిత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందించారు. అనంతరం మాట్లాుడతూ.. 2021 నుంచి ఇప్పటివరకు చిన్నచిన్న కారణాలతో డిస్మిస్ చేసిన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు 1,300 మంది వరకు ఉన్నారని.. వారందరికీ తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. వారిలో 491 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చారని.. కానీ, వారిని ఉద్యోగాల్లోకి తీసుకునే ఆలోచనలో సంస్థ లేనట్టుగా ఎండీని కలిసిన తర్వాత తెలిసిందని ఆరోపించారు. వెంటనే వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగతా కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే.. ఆర్టీసీలో హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటున్నారని.. వాటి డ్రైవర్లపై ఆర్టీసీకి నియంత్రణ ఉండటం లేదని.. హైర్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ డ్రైవర్లే నడిపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొందిన వారని.. ప్రైవేటు డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అలాగే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలకు భద్రతతో కూడిన ప్రయాణం, ఉద్యోగ భద్రత కార్మికులకు లభిస్తుందని చెప్పారు.






