అమెరికాలో కల్వకుంట్ల కవిత హోర్డింగ్స్

by Gantepaka Srikanth |

సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అమెరికాలోని కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కవిత ఫొటో, తెలంగాణ జాగృతి పేరుతో హోర్డింగులు ఏర్పాటు చేశారు.

అమెరికాలో కల్వకుంట్ల కవిత హోర్డింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)కు అభిమానులు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అమెరికాలోని కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కవిత ఫొటో, తెలంగాణ జాగృతి పేరుతో హోర్డింగులు ఏర్పాటు చేశారు. కాగా, బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న కవిత కవిత సొంత సైన్యం ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టారు. పార్టీలో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో సొంత బలాన్ని, బలగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో పార్టీ పరంగా తనకు మద్దతు లభించకున్నా, పార్టీ నుంచి వేరుపడాల్సి వచ్చినా.. తన వెంట నడిచి వచ్చే వారిని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే జాగృతిని బలోపేతం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేస్తున్నారు.

Next Story