ఐడీపీఎల్ భూముల ఆక్రమణలపై విచారణ జాగృతి విజయమే: కవిత

by Ajay Maddhiboyina |

తెలంగాణ జాగృతి పోరాటాలతోనే ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

ఐడీపీఎల్ భూముల ఆక్రమణలపై విచారణ జాగృతి విజయమే: కవిత
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి పోరాటాలతోనే ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ జాగృతి విజ‌య‌మేన‌ని అన్నారు. జ‌నంబాట కార్య‌క్ర‌మంలో భాగంగా మేడ్చ‌ల్ జిల్లా జ‌ర్య‌ట‌న సంద‌ద‌ర్భంగా ఐడీపీఎల్ స‌హా ప్ర‌భుత్వ భూముల ఆక్ర‌మ‌ణ‌ల విష‌యాన్ని ప్ర‌జ‌లు త‌న దృష్టికి తీసుకువ‌చ్చార‌ని తెలిపారు. ఆ విషయాలనే తాను మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు.

ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామ‌ని చెప్పారు. ఈ విచారణలో నిజాలను నిగ్గు తేల్చాలన్నారు. తమ కుటుంబం పై రాజకీయ కారణాలతో ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుండి విడిపించాలని చెప్పారు. ఆ భూములన్నీ ప్రజలకే చెందాలని క‌విత‌ డిమాండ్ చేశారు.

Next Story