- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kaleshwaram: దేవుడు వర్సెస్ కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మొన్నటి వరకు కాళేశ్వరం క్రెడిట్ తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ దుయ్యబట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మొన్నటి వరకు కాళేశ్వరం (Kaleshwaram) క్రెడిట్ మొత్తం తనదేనని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చి తప్పించుకోవాలని చూస్తున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Visveshwar Reddy) విమర్శించారు. కాళేశ్వరం మంచైనా చెడైనా దానికి కేసీఆరే బాధ్యుడు అని అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టు అతిపెద్ద ఇంజినీరింగ్ బ్లండర్ అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ అంటే కేసీఆర్.. కేసీఆర్ (KCR) అంటే కేబినెట్ అనేలా ఉండేదని అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి ఉందని ఈటల చెప్పారన్నారు. కేసీఆర్ గురించి కమిషన్ అడిగి ఉంటే ఈటల ఆయన పేరు చెప్పేవారన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకపోయినా ఈ ఏడాది ఎక్కువ వరి పండిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు.
దేవుడు వర్సెస్ కేసీఆర్:
కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని కోణాల్లో అనేక తప్పిదాలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వర్షాకాలంలో దిగువ నుంచి ఎగువకు నీళ్లను పంపు చేస్తారని అదే వర్షకాలంలో దేవుడు ఆకాశం నుంచి నీళ్లను కిందకు పంపుతాడు. దేవుడు వర్సెస్ కేసీఆర్ లో ఎవరు గెలుస్తారని ప్రశ్నించారు. బేసిక్ ఫిజిక్ పాటించలేదన్నారు. మేడిగడ్డ ను బ్యారేజీ మాదిరిగా కాకుండా రిజర్వాయర్ గా వాడకం మొదలుపెట్టగానే అది కొట్టుకుపోయిందన్నారు. మేడిగడ్డ కుంగుబాటు వెనుక వెదర్ సైన్స్ ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై త్వరలోనే తాను ఇక్కడే అందరికీ అర్థమయ్యేలా త్రీడీ మోడల్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్నారు. బీజేపీ ఎంపీలను జీరోలు అని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలపై స్పందించిన ఆయన రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే జరుగుతోందన్నారు.






