- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండలిలో కాళేశ్వరం మంటలు.. ఆందోళనకు దిగిన BRS ఎమ్మెల్సీలు
కాళేశ్వరం (Kaleshwaram) నివేదికను అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య నిప్పును రాజేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం (Kaleshwaram) నివేదికను అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య నిప్పును రాజేస్తోంది. ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జస్టిస్ చంద్రఘోష్ (Justice Chandraghosh) కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్టు అంతా ఓ ట్రష్ అంటూ ఆ నివేదిక కాపీలను చించి చెత్తబుట్టలో పడేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ శాసన మండలిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐ (CBI)కి ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మండలిలో బీఆర్ఎస్ సభ్యులు మెరుపు ఆందోళనకు దిగారు. సభను ముందుకు సాగనివ్వకుండా ఆ పార్టీ ఎమ్మెల్సీలు అడ్డుకున్నారు. ‘రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు’ అంటూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చి కాళేశ్వరం నివేదికను బీఆర్ఎస్ సభ్యులు చించేసి ఏకంగా పోడియం వైపునకు దూసుకెళ్లి విసిరేశారు. అనంతరం అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.






