Kadiyam Srihari: ఆ హౌ.. గాళ్లకు దేవుడు కొంచెమైనా బుద్ధి ఇచ్చాడా?.. బీఆర్ఎస్ నేతలపై కడియం ఘాటు వ్యాఖ్యలు

by Prasad Jukanti |

బీఆర్ఎస్ పై కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Kadiyam Srihari: ఆ హౌ.. గాళ్లకు దేవుడు కొంచెమైనా బుద్ధి ఇచ్చాడా?.. బీఆర్ఎస్ నేతలపై కడియం ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేను అయ్యాక స్టేషన్ ఘన్ పూర్ (Station Ghanpur) నియోజకవర్గానికి ఆసుపత్రిని తీసుకువస్తే అది బీఆర్ఎస్ (BRS) నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఈ ఔ*గాళ్లకు దేవుడు కాస్తయినా బుద్ధి ఇచ్చాడోలేదో నాకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఇవాళ స్టేషన్ ఘన్ పూర్‍లో మాట్లాడిన ఆయన.. ఇటీవల ఇక్కడ మీటింగ్ పెట్టిన బీఆర్ఎస్ నేతలు నిస్సిగ్గుగా ఆధారాలు లేకుండా మాట్లాడారని, నియోజకవర్గ అభివృద్ధికి తాను అడ్డుబడుతున్నానని చెబుతున్నారని మండిపడ్డారు. నేను వచ్చాకే ఘన్ పూర్ మున్సిపాలిటీకి అనుమతులు తెచ్చానని ఒకప్పుడు స్టేషన్ ఘనపూర్ పేరు చెప్పుకోడానికి సిగ్గుపడేవారు కానీ ఇప్పుడు ధైర్యంగా మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పుకుంటున్నారన్నారు.

Next Story