ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా నేను రెడీ: కడియం శ్రీహరి

by Ajay Maddhiboyina |

ఉపఎన్నిక‌లు నిర్వ‌హించేది ఎన్నిక‌ల క‌మిష‌న్ అని పార్టీలు కాద‌ని ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి అన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహిస్తుందని

ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా నేను రెడీ: కడియం శ్రీహరి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉపఎన్నిక‌లు నిర్వ‌హించేది ఎన్నిక‌ల క‌మిష‌న్ అని పార్టీలు కాద‌ని ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి అన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహిస్తుందని చెప్పారు. తెలివిలేని వ్య‌క్తులు ఉప ఎన్నిక‌లు ఎప్పుడు వ‌స్తాయో చెప్ప‌డం స‌రికాద‌న్నారు. ఒక‌వేళ ఉపఎన్నిక‌లు వ‌చ్చినా ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో తాను గెలిచి తీరుతాన‌ని దీమా వ్య‌క్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగ‌తిస్తున్నాన‌ని అన్నారు. స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూస్తామ‌ని, ఆయ‌న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామని అన్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు వ్య‌వ‌స్థ‌ల‌ను భ్రష్ఠు ప‌ట్టించిన‌వాళ్లు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి దెయ్యాలు వేదాలు వ‌ళ్లించిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని అన్నారు. ప‌దేళ్ల కాలంలో ఎన్ని పార్టీలు విలీనం చేసుకున్నారు. ఎంత‌మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఫిరాయించేలా చేశారో కేసీఆర్ మాట్లాడాల‌న్నారు. రాజ‌కీయ వ్య‌వ‌స్థ మాత్రం నాశనం అయ్యింద‌ని ఆరోపించారు.

Next Story