- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KA Paul: బెట్టింగ్ యాప్స్ కేసులో కేంద్రం కౌంటర్ వేయలేదు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసిన వాళ్లను జైల్లో పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బెట్టింగ్ యాప్స్ (betting apps)కి ప్రచారం చేసిన వాళ్లను జైల్లో పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ (KA Paul) డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసు రెండో కోర్టులో లిస్ట్ అయిందని, కానీ కోర్టుకు సెలవిచ్చారని అన్నారు. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని, కోర్టుకు సెలవు ఇస్తున్నారని ఆరోపించారు. (Supreme Court) సుప్రీం కోర్టులో బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ లిస్ట్ అయినా.. కోర్టు షట్ డౌన్ చేస్తున్నారు.. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్లకు న్యాయం జరగాలన్నారు. బెట్టింగ్ యాప్స్ పై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందరో బలవుతున్నారని, ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికీ కేంద్రం కౌంటర్ వేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇన్ని బస్సుల ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాజీనామా చేస్తున్నారా..? అధికారులపై చర్యలు తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. అలాగే Evm లను తీసేసి బ్యాలెట్ పేపర్ ను తీసుకురావాలని అన్నారు. Evmలు ఉన్నంత కాలం ఓడి పోతున్నామని ఆవేదన చెందారు. ఏపీలో తన ఛారిటీలపై పడుతున్నారని, ఛారిటీలకు ట్యాక్స్ ఉండవని స్పష్టం చేశారు. వచ్చేవారం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాను.. నన్ను ఆపడం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తం చేశారు. నా జోలికి రావద్దు, శాపాలు పొందవద్దని హితువు పలికారు. ప్రపంచం మొత్తం నన్ను వాడుకుంటుంది.. తెలుగు రాష్ట్రాలకు మేలు చేస్తామంటే ముఖ్యమంత్రులు ముందుకు రావడం లేదని కేఏపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.






