KA Paul: డొనాల్డ్ ట్రంప్ 30,573 సార్లు అబద్ధాలు ఆడాడు.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అబద్ధం ఆడారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

KA Paul: డొనాల్డ్ ట్రంప్ 30,573 సార్లు అబద్ధాలు ఆడాడు.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) అబద్ధం ఆడారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ (KA Paul) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్రంప్ తీరుపై విమర్శిస్తూ ఇవాళ ఒక వీడియో విడుదల చేశారు. 2016 నుంచి 2020 వరకు ఇలా ట్రంప్ 30,573 సార్లు అబద్దాలు ఆడారని.. ట్రంప్ అబద్దాలపై స్వయానా ఫ్యాక్ట్ చెక్ బహిర్గతం చేసిందని ఆ నివేదికను తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్ సంస్థలు ఆయన పై పరిశోధనలు చేశారని, ఈ నేపథ్యంలోనే ఆయన మిస్‌లీడింగ్ స్టేట్‌మెంట్స్, అబద్దాలు ఆడినట్లు ఫ్యాక్ట్ చెక్ బహిర్గతం చేసిందని వివరించారు. అసలు (Iran Israel war) ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగలేదని అందరికీ తెలుసని చెప్పారు.

యుద్ధం ఆపలేదని ఇరాన్ లీడర్ చెప్పారని, ఒకవేళ ఇజ్రాయెల్ ఎటాక్స్ చేయడం ఆపితే.. మేము కూడా ఆపుతామని ఇరాన్ చెప్పిట్లు వెల్లడించారు. క్రిస్టియన్ అని చెప్పుకునే ట్రంప్ ఇన్ని అబద్ధాలు ఆడొచ్చా? అని మండిపడ్డారు. అబద్ధాలు ఆడేవారు పరలోకం చేరే అవకాశం లేదు.. అని బైబిల్ లో ఉన్నట్లు వ్యాఖ్యలు గుర్తుకు చేశారు. పిచ్చోడి చేతిలో రాయి లాగా.. ట్రంప్ చేతిలో అణు ఆయుధాలు ఆయన చేతిలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ట్రంప్ చేతిలో న్యూక్లియర్ అణు ఆయుధాలు ఉండటం ప్రపంచానికి హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story