దేశం కోసం అమెరికాలో ప్రముఖులను కలిసి వచ్చా: కేఏ పాల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-10 15:33:21  IST  )

ఇండియా కోసం న్యూయార్క్, వాషింగ్ట‌న్ డీసీలో ప్ర‌ముఖుల‌ను క‌లిసి వ‌చ్చాన‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. తాను క‌లిసిన‌వారిలో సెన‌ట‌ర్స్ కూడా ఉన్నార‌ని చెప్పారు.

దేశం కోసం అమెరికాలో ప్రముఖులను కలిసి వచ్చా: కేఏ పాల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా కోసం న్యూయార్క్, వాషింగ్ట‌న్ డీసీలో ప్ర‌ముఖుల‌ను క‌లిసి వ‌చ్చాన‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. తాను క‌లిసిన‌వారిలో సెన‌ట‌ర్స్ కూడా ఉన్నార‌ని చెప్పారు. పాకిస్థాన్ తీవ్ర‌వాద దాడుల గురించి వారితో చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. ర‌ష్యా మ‌న దేశాన్ని దెబ్బ తీసేందుకు పాకిస్థాన్ కు సాయం చేస్తుంద‌ని చెప్పారు. న్యూయార్క్‌లో వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ గ్లోబ‌ల్ పీస్ స‌మ్మిట్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేలు మామూలు డిమాండ్ చేస్తూ దొరికారన్నారు.

దేశంలోని ప్ర‌తి ఎమ్మెల్యే కూడా అలానే ఉన్నార‌ని విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి తానే బీజేపీ స్టూడెంట్, టీడీపీ కాలేజీ స్టూడెంట్ అని చెప్పార‌న్నారు. కాంగ్రెస్‌లో ఉద్యోగం చేస్తున్నాన‌ని చెబుతున్నారని, అంటే ఎప్పుడు వెళ్లిపోతారో చెప్పలేమ‌న్నారు. కాబ‌ట్టి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎం ప‌ద‌వి నుండి త‌ప్పించాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత‌లు రేవంత్ రెడ్డిని త‌ప్పించే ప్లాన్ చేస్తున్నార‌ని ఆరోపించారు. మ‌రోవైపు రేవంత్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యేలతో బ‌య‌ట‌కువ‌చ్చి ఇత‌ర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన‌ట్టు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌న్నారు. భారత రాజ్యాంగం జోక్ అయిపోయింద‌ని విమ‌ర్శించారు. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల‌ను వెంట‌నే ప‌ద‌వి నుండి త‌ప్పించాల‌ని డిమాండ్ చేశారు.

Next Story