- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూడాల సమ్మె క్యాన్సిల్
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (T-JUDA) అధ్యక్షుడిగా, రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల కీలక ఆందోళనలను సానుకూలంగా

దిశ తెలంగాణ బ్యూరో: తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (T-JUDA) అధ్యక్షుడిగా, రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల కీలక ఆందోళనలను సానుకూలంగా పరిష్కరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (T-JUDA) తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని టీ జూడాస్ అధ్యక్షుడు ఐజాక్ న్యూటన్ తెలిపారు. అలాగే తెలంగాణలోని అన్ని వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
MCMC కమ్యూనిటీ విద్యార్థి ప్రతినిధుల నుండి సలహాలు తీసుకొని వాటిని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇదిలా ఉంటే తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే జూన్ 30న రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని జూన్ 27న జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో రేపు సమ్మెకు దిగనున్న జూడాలతో ప్రభుత్వం తరపున వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు జరిపారు. స్టైఫండ్ పెంపు, మెడికల్ కాలేజీల్లో, అనుబంధ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల పెంపుకు ప్రభుత్వం అంగీకరించడంతో తాము సమ్మె విరమిస్తున్నామని జూడాల అధ్యక్షుడు ఐజాక్ న్యూటన్ వెల్లడించారు.
ప్రభుత్వం పరిష్కరించిన సమస్యలు ఇవే
*స్టైపెండ్ పెంపు
*స్టైపెండ్ల నియమితీకరణ కోసం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ
*సీనియర్ రెసిడెంట్ల ఒప్పందాల పొడిగింపు
*ప్రభుత్వ ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఒప్పందాల పొడిగింపు






