జూబ్లీహిల్స్ ఫేక్ ఓట్ల వ్యవహారం.. విచారణకు ఆదేశించిన ఆర్వీ కర్ణన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-13 10:10:04  IST  )

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఉన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూబ్లీహిల్స్ ఫేక్ ఓట్ల వ్యవహారం.. విచారణకు ఆదేశించిన ఆర్వీ కర్ణన్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఉన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ (Congress) నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇవాళ రహమత్‌నగర్‌ (Rahamat Nagar)లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశం అంతటా ‘ఓట్‌ చోరీ’ అంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో జరుగుతోన్న ఓట్ల చోరీపై దృష్టి పెట్టాలన్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఫేక్ ఓట్ల వ్యవహారాన్ని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణణ్ (RV Karnan) సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు ఆరోపణలను సుమోటోగా తీసుకుని యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని కృష్ణా నగర్‌లో హౌస్‌ నెం.8-3-231/B/160లో ఇటీవల నమోదైన 43 ఓట్లపై విచారణకు ఆదేశించారు.

Next Story