- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఓటు వేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20. 76 శాతం పోలింగ్ నమోదు అయింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక)కు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20. 76 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న సెలబ్రేటీలు, ప్రముఖులు ఉదయాన్ని వచ్చి క్యూ లైన్లలో నిల్చోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) కూడా ఉన్నారు. ఆయన మధుర నగర్ లోని శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్ లోని పోలింగ్ బూత్ 132 లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని అన్నారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలి, వృధా చేసుకోవద్దని ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఓటర్లకు సూచించారు. యువత కూడా ఓటు వేసిన తర్వాత మిగతా పనులు చూసుకోవాలని, ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఈ సందర్భంగా ఏవి రంగనాథ్ చెప్పుకొచ్చారు.






