Jubilee Hills By-Election: మద్దతుపై ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై ఎమ్‌ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు.

Jubilee Hills By-Election: మద్దతుపై ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)పై ఎమ్‌ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో తమకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అలా అని మాకు శత్రుత్వం కూడా ఎవరితోనూ లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తాము సైద్ధాంతికంగా రాజీపడటం లేదని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. ఇటీవల సీఎం రేవంత్ ఫోన్ చేసి నన్ను కలవాలని చెప్పారు.. కలిశాక మీ నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయని అడిగారు.. నా నియోజకవర్గంలోని ఒకభాగంలో మెట్రో లైన్ రాలేదని గుర్తుచేసినట్లు అసదుద్దీన్ చెప్పుకొచ్చారు. ఆ మొత్తం మెట్రో లైన్ పూర్తవడానికి రూ.2 కోట్ల వరకూ అవుతుంది.. తాను ఇదే విషయాన్ని రేవంత్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.

Next Story