- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ(Jana Sena Party) మద్దతు ప్రకటించింది. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ మరియు పలువురు పార్టీ రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటామని హామీ ఇచ్చారు. కాగా, జూబ్లీహిల్స్‌లో పోలింగ్‌కు ఇంకా ఆరు రోజులే ఉండటంతో ప్రచారం మరింత వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగ ప్రచారం చేస్తున్నారు. లంకల దీపక్ రెడ్డి తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.






