Jubilee Hills By-Election: బీఆర్ఎస్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-25 13:14:01  IST  )

జూబ్లీహిల్స్‌(Jubilee Hills By-Election)లో బీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిందని కాంగ్రెస్(Congress) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Jubilee Hills By-Election: బీఆర్ఎస్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌(Jubilee Hills By-Election)లో బీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిందని కాంగ్రెస్(Congress) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తన సొంత పత్రికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తరుపున ప్రచురన రూపంలో ప్రచారాలు చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. MCMC కళ్లు కప్పి మీడియాలో కథనాలు ప్రచారాలు చేయడం ఎన్నికల ఉల్లంఘన అంటూ కాంగ్రెస్ ఆరోపించింది. కనీస మీడియా విలువలను పాటించకుండా నిస్సిగ్గుగా వ్యవహరించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికా ప్రకటనలను కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కింద పరిగణించాలనించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌కు కలిసి టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ఈ ఫిర్యాదును అందజేశారు.

Next Story