అర్ధరాత్రి ఆ ఫ్లై ఓవర్ పై లేడీస్ రైడ్.. రంగంలోకి పోలీసులు !

by velandi.Saikiran |

హైదరాబాద్ మహానగరంలో ( Hyderabad) ఫ్లై ఓవర్లు ( Flyover), రింగ్ రోడ్లు , నేషనల్ హైవేలో అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో

అర్ధరాత్రి ఆ ఫ్లై ఓవర్ పై లేడీస్ రైడ్.. రంగంలోకి పోలీసులు !
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో ( Hyderabad) ఫ్లై ఓవర్లు ( Flyover), రింగ్ రోడ్లు , నేషనల్ హైవేలో అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రోడ్లపై.. టు వీలర్ తో ఫోర్ వీలర్ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. అంతకంటే భారీ వాహనాలు కూడా వెళ్తాయి. అయితే కొన్ని రహదారులలో కొన్ని వాహనాలపై ఆంక్షలు విధిస్తారు అధికారులు.

ఔటర్ రింగ్ రోడ్డుపై ( Outer ring road) టూ వీలర్స్ ( Two wheelers) అసలు ఎక్కకూడదు. అలా టూ వీలర్ వెహికల్స్... ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అయితే తాజాగా హైదరాబాద్ లోని పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పైన ( PV Narasimha Rao Expressway )... టూ వీలర్స్ యదేచ్చగా తిరుగుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో... టూ వీలర్ వెహికల్స్ విపరీతంగా తిరుగుతున్నాయని ఓ వీడియో వైరల్ గా మారింది.

ఇద్దరు మహిళలను బైక్ పైన ఎక్కించుకొని వెళ్తున్న రెండు వాహనాలకు సంబంధించిన వీడియోను కారు డ్రైవర్ సోషల్ మీడియాలో పెట్టాడు. అర్ధరాత్రి 1:10 గంటలకు... టు వీలర్ వెహికల్స్ హైవే పైన వెళ్తున్నాయని.. సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులను ( Hyderabad police) ట్యాగ్ చేస్తూ పెట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా స్పందించారు. ఆ రెండు వాహనాలపై చర్యలు తీసుకుంటామని.. పోలీసులు కూడా స్పందించారు.


Next Story