CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో పాలమూరు ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే?

by Ramesh Naini |

మహబూబ్‌నగర్‌‌లో బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో పాలమూరు ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబ్‌నగర్‌‌లో బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం జుబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar MLAs) ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శాలువ కప్పి సత్కరించారు. ఈ మేరకు కాసేపు సీఎం ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, చిట్టెం పర్ణికా రెడ్డి, తూడి మేఘా రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఈ (IIIT new campus) ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్‌లో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి. మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో ఈ ఏడాది నుంచి మూడు కోర్సులు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. 1) ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ ప్రోగ్రాం (6 సంవత్సరాలు) - ఇది రెండేళ్ల ప్రీ-యూనివర్సిటీ కోర్సు, నాలుగేళ్ల బీ.టెక్‌ను కలిపి ఉంటుంది. ఈ కోర్సు 10వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. 2) ఎం.టెక్ (2 సంవత్సరాలు) - ఇంజనీరింగ్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సు, దీనికి GATE స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. 3) పీహెచ్‌డీ ప్రోగ్రామ్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధన కోసం ఈ కోర్సు ప్రారంభిస్తారు. ఈ క్యాంపస్‌లో అడ్మిషన్లు, ఫీజు వివరాలు, ఇతర సమాచారం త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో www.rgukt.ac.in అందుబాటులో ఉంటుంది. (Basra) బాసర క్యాంపస్‌లో ఇప్పటికే ఈ కోర్సులు నడుస్తున్నాయి. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు.

Next Story