- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Damodara: రాబోయే నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు.. మంత్రి దామోదర గుడ్ న్యూస్
అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) ఆశయాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Naranarsimha) అన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలే ఇందుకు ఉదాహరణలన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఆ మహనీయుని జయంతి నాడే దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కల సంపూర్ణంగా నెరవేరుతుండడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. రాబోయే నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు (Job Notifications) వెలువడుతాయని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగాలను సాధించుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నాడు తెలంగాణ రాష్ట్ర కల నెరవేరిందని, సాధించుకున్న తెలంగాణలో ఈరోజు వర్గీకరణ ఆకాంక్ష సాకారమైందన్న మంత్రి అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని స్వేచ్చగా ఆత్మగౌరవంతో బతకడం అలవర్చుకోవాలని ఈ పిలుపునిచ్చారు.






