- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court : జన్వాడ డ్రోన్ కేసు... సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్ట్ కీలక నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తనపై గతంలో నమోదైన జన్వాడ డ్రోన్ కేసు(Janwada Drone Case) కొట్టివేయాలంటూ హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు, ఆ పార్టీ నేత కేటీఆర్(KTR) కు చెందిన జన్వాడలోని ఫాంహౌసుపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ 2020 మార్చిలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదయింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈకేసులో అప్పట్లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా తనపై పెట్టిన తప్పుడు కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ ఫాంహౌసు ఉన్న ప్రాంతం నిషేధితం ఏమీ కాదని, తప్పుడు కేసులు పెట్టి రేవంత్ రెడ్డిని జైలుకు తరలించారని ఆయన తరపున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. కాగా ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. కేసు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.






