- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలు కోరుకుంటే మార్చడంలో తప్పు లేదు: జానారెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజలు కోరుకుంటే దేనినైనా మార్చవచ్చని జానారెడ్డి పేర్కొన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం ఎలా జరుగుతోందో, ఈవిఎంలు అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం వోట్ చోరీకి ఎలా పాల్పడిందో వివరించి, 'votechori' ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ఈవిఎంలపై జరుగుతున్న చర్చపై జానారెడ్డి స్పందించారు. ప్రజలు బ్యాలెట్ వద్దు అనుకొని, ఈవిఎంల వైపు వెళ్తే దానిని స్వాగతించామని, ఇపుడు ఈవిలు రద్దు చేయాలని స్వయంగా ప్రజలే కోరితే దానిని కూడా స్వాగతిస్తాం అన్నారు.
ప్రజలు కోరుకుంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసి మార్చడంలో తప్పులేదు అన్నారు. కాగా నేడు గుంటూరులో ఓ కార్యక్రమానికి హాజరైన జానారెడ్డి.. తెలుగు ప్రజలు భౌగోళికంగా మాత్రమే విడిపోయారని, మానసికంగా ఎప్పుడూ కలిసే ఉంటారని పేర్కొన్నారు.






