ప్రారంభమైన జనహిత పాదయాత్ర

by Muthe.Rajitha |

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర(Janahitha Padayatra), శ్రమదానం కొద్దిసేపటిక్రితం ప్రారంభం అయింది.

ప్రారంభమైన జనహిత పాదయాత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర(Janahitha Padayatra), శ్రమదానం కొద్దిసేపటిక్రితం ప్రారంభం అయింది. వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో ప్రారంభం అయిన జనహిత పాదయాత్ర తొలిరోజు అట్టహాసంగా సాగుతోంది. ఈ పాదయాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్(Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, పరిగి ఎమ్మెల్యే తమన్నగారి రామ్మోహన్ రెడ్డితో సహ పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొంటున్నారు. కాగా

అంతకముందు చిలుకూరు బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మీనాక్షి నటరాజన్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ పాదయాత్ర తొలివిడతలో భాగంగా జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు పరిగి, ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో సాగనుంది.

Next Story