తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు

by Ramesh Naini |

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తమ హక్కుల కోసం ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని, బ్రతికి పోరాడి సాధించుకుందామని కార్మికులకు జనసేన ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఈ మేరకు నటుడు, జనసేన పార్టీ నాయకుడు ఆర్.కె. సాగర్ ఒక వీడియో విడుదల చేశారు. సమ్మెలో భాగంగా నర్సంపేట డిపోకు చెందిన కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడటం పట్ల జనసేన తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ మరణం అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, ఆయన ఆత్మహత్యతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులకు జనసేన విజ్ఞప్తి..

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది యువకులు, విద్యార్థులు బలిదానాలు చేసినా ఏ ప్రభుత్వమూ వారిని పట్టించుకున్న దాఖలాలు లేవని గుర్తుచేశారు. కాబట్టి ప్రాణాలు వదలడం సమస్యకు పరిష్కారం కాదని, ధైర్యంగా పోరాడి డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. సమ్మె చేస్తున్న సుమారు 38 వేల మంది ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు ఈ రోజు నుంచి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని ఆయన ప్రకటనలో స్పష్టం చేశారు.

Next Story