- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో పోటీ చేస్తూనే ఉంటాం: జనసేన
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జనసేన నేతలు స్పందించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల(Telangana Municipal Election Results)పై తెలంగాణ జనసేన(Jana Sena Party) నేతలు స్పందించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఉపాధ్యక్షలు బొంగునూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలలో 330 పైగా జనసేన అభ్యర్థులు పోటీలో నిలిచారు, మంచిర్యాల కార్పొరేషన్‌లో 34వ డివిజన్ నుండి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అగ్గు సాగర్ 31 ఓట్ల మెజార్టీతో, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డు నుండి 29 ఓట్ల మెజారిటీతో ఆరూరి విజయలక్ష్మి నాగేశ్వరరావు విజయం సాధించారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మా జనసేన పార్టీని గుర్తించి ఓట్లు వేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
చాలా కష్టపడ్డాం..
ముఖ్యంగా ఈ ఎన్నికలలో జనసేన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు వీర మహిళలు అందరూ ఉన్న తక్కువ సమయంలో చాలా కష్టపడి పనిచేసిన వారి అందరికీ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తరుపున, తెలంగాణ రాష్ట్ర నాయకులు తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. బలంగా పనిచేసిన వారికి, గెలిచిన అభ్యర్థులకి, జనసేన పార్టీని గుర్తించి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు, రెండు చోట్ల గెలవడం సంతోషకరం ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాం అన్నారు. సినీ నటుడు ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసిన జనసేన పార్టీ శ్రేణుల అందరికీ, గెలిచిన అభ్యర్థులకి, జనసేన పార్టీని గుర్తించి ఓట్లు వేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజులలో పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని తెలిపారు.






