- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Terror Attack : జమ్ముకాశ్మీర్ ఉగ్రదాడి.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం(Pahalgoan)లో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే(Tourists) లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇప్పటి వరకు 27 మంది టూరిస్టులు మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఉగ్రదాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని తెలిపారు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలియజేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






