కాంగ్రెస్ పాలన బాగుంది కానీ..: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-24 13:11:10  IST  )

తెలంగాణలో కాంగ్రెస్ పాలన భేషుగ్గా ఉందంటూనే పాలనపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి(Jaggareddy ).

కాంగ్రెస్ పాలన బాగుంది కానీ..: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ పాలన భేషుగ్గా ఉందంటూనే పాలనపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి(Jaggareddy ). నేడు జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) భేటీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బీఆర్ఎస్ పాలన కంటే గొప్పగా ఉందని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అసంతృప్తితో ఉన్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల కష్టం వృథా కాకుండా ఉండాలంటే క్షేత్రస్థాయి కార్యకర్తలను సంతృప్తి పరచాలని సూచించారు.

వారికి తగిన ఆర్థిక సహాయం, గుర్తింపు ఇవ్వాలని పీఏసీకి కీలక సలహాలు అందజేశారు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యకర్తల ఆర్థిక, మానసిక మద్దతు కీలకమని నొక్కి చెప్పారు. కాగా ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. జగ్గారెడ్డి సూచనలను సానుకూలంగా పరిగణిస్తూ కార్యకర్తల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Next Story