Jaggareddy: ఆ ఎమ్మెల్యే మంత్రి కావాలి.. టీ కాంగ్రెస్ లో బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి

by Prasad Jukanti |

మంత్రి వర్గ విస్తరణపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

Jaggareddy: ఆ ఎమ్మెల్యే మంత్రి కావాలి.. టీ కాంగ్రెస్ లో బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంట్రవర్సీ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) తాజాగా మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై (Cabinet Expansion) జోరుగా చర్చ జరుగుతున్న వేళ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్ (Vakati Srihari Mudiraj) మంత్రి కావాలని జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు. సంగారెడ్డిలో మాట్లాడిన ఆయన.. శ్రీహరి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఖర్గే కోటాలో శ్రీహరి ముదిరాజ్ కు టికెట్ వచ్చింది. ముదిరాజ్ కోటాలో మంత్రి కావాల్సిన ఏకైక నేత శ్రీహరి అన్నారు.

రెండు రోజుల క్రితం శ్రీహరి ఆవేదన:

కాంగ్రెస్ పార్టీ లో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డినే (CM Revanth Reddy) ప్రకటించారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై చర్చకు వచ్చిన ప్రతిసారి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం అనే టాక్ తెరపైకి వస్తోంది. కానీ ఆయా కారణాలతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. వాకాటి శ్రీహరి విషయంలో ఎలాంటి నిర్ణయం రావడం లేదు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఓ మీడియాతో మాట్లాడిన వాకాటి శ్రీహరి తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేంటో తన క్యారెక్టర్ ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి, అధిష్టానానికి తెలుసన్నారు. మానసికంగా ఇబ్బంది పెట్టేవారు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. వాకాటి శ్రీహరి ఈ రకమైన ఆవేదన వ్యక్తం చేసిన రెండు రోజులకే జగ్గారెడ్డి శ్రీహరికి మంత్రిపదవి ఇవ్వాలంటూ వ్యాఖ్యలు చేయడం హస్తం పార్టీలో ఆసక్తిగా మారింది.

Next Story