Jaggareddy : మోసగాళ్లకు మోసగాడు మోడీ : జగ్గారెడ్డి ఫైర్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-06 14:14:57  IST  )

బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao)పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి(Jaggareddy) ఫైర్ అయ్యారు.

Jaggareddy :  మోసగాళ్లకు మోసగాడు మోడీ : జగ్గారెడ్డి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao)పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి(Jaggareddy) ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై రఘునందన్ రావు చేసిన విమర్శలపై జగ్గారెడ్డి ఘాటుగా బదులిచ్చారు. మీరు మా సీఎంను తిడితే మేము మీ ప్రధానిని తిడతామని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్ఎస్(BRS), బీజేపీతో అంటకాగి ఇప్పుడు సుద్ధపూసలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2014లో దేశ ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన మీరు.. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేశారా మరి అని ప్రశ్నించారు.

మీరు మా సీఎంను నోటికి వచ్చిన మాటలు అంటే మేము మోసగాళ్లకు మోసగాడు మీ ప్రధాని మోడీ(PM Modi) అనగలమని వార్నింగ్ ఇచ్చారు. అలా అంటే మీకు ఎంత బాధ ఉంటుందో మా నాయకుడిని అంటే మాకు కూడా అంతే బాధ ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు.

Next Story