- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jaggareddy: ఎమ్మెల్సీ టికెట్ నాకొద్దు..టీ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే?

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల దృష్టి అంతా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల చుట్టే తిరుగుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదని అన్నారు. ఎమ్మెల్యేగా సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించినా...ఓడించినా లాభమే చేస్తున్నారన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చే ప్రాధాన్యతతో తృప్తిగా ఉన్నానని, ఎమ్మెల్సీ కావాలని అడగలేదు..అడగబోను అన్నారు. తనకు బదులుగా కమ్మ సామాజిక వర్గానికి 30 ఏళ్లుగా ఎలాంటి పదవి లేకుండా అండగా నిలబడిన కుసుమ కుమార్, ముప్పై ఏళ్లుగా గాంధీ భవన్‌కు సేవలు చేస్తున్న కుమార్ రావుకి (Kumar Rao) ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే బాగుంటుందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ లో యాక్టివ్ పాలిటిక్స్ కోసం:
సంగారెడ్డిలో (Sangareddy) నా ఓటమి నా భార్య నిర్మలకు చైర్మన్ అయ్యే వెసులుబాటు వచ్చింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్ (Jetti kusum kumar) ౩౦ ఏళ్లుగా ఎలాంటి పదవీ లేకుండా ఉన్నాడని ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ దృష్టికి తీసుకువెళ్లానని, మరోసారి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాన్నారు. కమ్మ సామాజిక వర్గం సెటిలర్స్ కు అవకాశం ఇస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో కలిసి రావొచ్చన్నారు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఉత్తమ్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రేవంత్ సీఎం అయ్యాడు.. పొన్నం మంత్రి అయ్యాడు.. ఈ సారి ఎమ్మెల్సీగా జెట్టికి ఇవ్వాలని జగ్గారెడ్డి సూచించడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్ లో యాక్టివ్ పాలిటిక్స్ ఉండాలంటే జెట్టి కుసుమ కుమార్ కు అవకాశం ఇవ్వాలన్నారు. కులం ప్రాతిపదికన కాకుండా.. పార్టీకి సేవలు అందించిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఉండాలన్నారు.






