- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaggareddy: తప్పు మీరు చేసి రాహుల్ గాంధీని అంటారా?.. జగ్గారెడ్డి ఫైర్
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బీజేపీపై ఫైర్ అయ్యారు.

దిశ,డైనమిక్ బ్యూరో: పాకిస్థాన్ విషయంలో ఉద్రిక్తతల తర్వాత కేంద్రప్రభుత్వం, బీజేపీ (BJP) షాక్ లో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.అందుకే రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా తెలంగాణ మీద నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియతో మాట్లాడిన ఆయన.. పహెల్గాం ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అని ఆరోపించారు. ఈ దాడిపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వీటిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కూడా జమ్మూకశ్మిర్ లో ఎందుకు ఉగ్రదాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని.. రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుడా బీజేపీ నేతలు మాట్లాడితే వారిని తెలంగాణ గడ్డపై ప్రతిఘటిస్తామని, ఈ విషయంలో ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటామన్నారు. మీరు తప్పులు చేసి ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేస్తున్నారంటే మీదు ఎంతటి దుర్మార్గమైన ఆలోచన ఎంతటి నీచమైన సంస్కృతి అని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి ఓట్లు దండుకోవడమేనా అని నిలదీశారు.






