- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా కూటమి కాదు.. ఇక కాంగ్రెస్సే.. జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
భగవంతుడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని తొలగించేందుకు కుట్ర చేస్తోందని జగ్గారెడ్డి మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భగవంతుడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతూ, మతం పేరుతో సీట్లు గెలిచి అధికారం కాపాడుకుంటోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ దేశ ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే రక్షణ కవచం అని ఈ కవచాన్ని తొలగించాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రనే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని ఆయన చెబుతున్నారన్నారు. రాజ్యాంగం విషయంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు కీలకమైనవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.
ఇండియా కూటమి కాదు కాంగ్రెస్సే:
ఐటీ సంస్కరణలకు బీజం వేసింది రాజీవ్ గాంధీ అన్నారు. మరి మోడీ ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. పేదవవాళ్ల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెసేనన్నారు. బీజేపీ నేతలు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. హామీ ఇచ్చినట్లు తెలంగాణను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఓటు ఒకరికి వేసి మొక్కితే దేవుడు కూడా ఏమి చేయలేదన్నారు. విభజన హామీలు నెరవేరాలంటే తెలంగాణ, ఏపీలో ఇండియా కూటమిలు కాదని నేరుగా కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని డిమాండ్ చేశఆరు. కాక్రోచ్ పార్టీ ఇప్పుడే మొదలైందని వారి ఉద్దేశం పూర్తిగా బయటపడాల్సి ఉందన్నారు.






