Jaggareddy: కేసీఆర్ గతాన్ని మర్చిపోయారా? 'డూప్లికేట్ గాంధీ' కామెంట్స్ పై జగ్గారెడ్డి ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2025-04-28 11:59:12  IST  )

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Jaggareddy: కేసీఆర్ గతాన్ని మర్చిపోయారా? డూప్లికేట్ గాంధీ కామెంట్స్ పై జగ్గారెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) మండిపడ్డారు. రాహుల్ గాంధీపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు (KCR) లేదన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి నిన్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో డూప్లికేట్ గాంధీలు (Duplicate Gandhi) అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ వయసులో పెద్ద వారని మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఓ చరిత్ర ఉందని ఆ కుటుబంపై కేసీఆర్ మాట్లాడి తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కోల్పోవద్దని అన్నారు. రాష్ట్ర విభజన జరాగాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇంటి చుట్టూ తిరిగిన రోజులు కేసీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ విభజన కోసం ఒప్పించేందుకు నెలల తరబడి వారి కోసం ఢిల్లీలో ఎదురు చూసిన రోజులు మర్చిపోయారా? రాష్ట్ర విభజనకు ముందు వాళ్లు ఒరిజినల్ గాంధీలు ఇప్పుడేమో డూప్లికేట్ గాంధీలా ఇదేనా కేసీఆర్ మీరు నేర్చుకున్న రాజకీయ విలువలు అని ప్రశ్నించారు. రాజకీయాల్లో హీరో, విలన్ అన్ని కాంగ్రెస్ (Congress) పార్టీనే అన్నారు. ప్రజల కోసం హీరో పాత్ర, ప్రతిపక్షాల పాలిట విలన్ల పాత్రలో మేమే ఉంటామన్నారు.

Next Story