- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాడెవడో తెలిస్తే చెప్పుతో కొడతా? కోమటిరెడ్డి వార్తలపై జగ్గారెడ్డి ఫైర్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది ఓ చరిత్ర అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది ఓ చరిత్ర అన్నారు. ఆయన ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. ఇది మంచి పద్దతి కాదని మంచి సాంప్రదాయం కాదని అన్నారు. ఇలాంటి వార్తలు రాయమని ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు. వెంకట్ రెడ్డి మీద ఇలాంటి స్టోరీలు వేయమని ఎవరు చెప్పారో వాడికి బయటకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. వాడెవడో తెలిస్తే చెప్పుతో కొడతామంటూ ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి ఒక నాయకుడిగా ఎదిగేందుకు ఎంతో కష్టపడి వచ్చాడని అన్నారు.
ఏదో సంబంధాలు పెట్టి వైరల్ చేస్తున్నారని తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి వెంకట్ రెడ్డి సైతం ఇప్పటికే స్పందించారు. ఆ వార్తలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అధికారులపై రాస్తున్న వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తనకు ఉన్న ఒక్కగానొక కుమారుడిని కోల్పోయి ఫౌండేషన్ పేరుతొ ప్రజాసేవ చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం తరుపున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరారు. తన కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేదని అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.






