మీ దందాలకు మేము ఇబ్బంది పెట్టామా? పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే మరోసారి హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

మోడీ, చంద్రబాబు తనకు క్లోజ్ అనే అహంకారంతోనే తెలంగాణ ప్రజలపై పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శించారు.

మీ దందాలకు మేము ఇబ్బంది పెట్టామా? పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే మరోసారి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజల దిష్టితో ఆంధ్ర అభివృద్ధి ఆగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనడం దారుణం అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి విమర్శించారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన ఆయన.. తెలంగాణ వారికి సెంటిమెంట్ ముఖ్యమని మీకులా డబ్బులు ముఖ్యం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసం ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? పొత్తులు ఎవరు పెట్టుకుంటున్నారో అందరికి తెలుసన్నారు. ఆంధ్రవారందరిని అనడం లేదని వారిలో కొంత మంది డబ్బుల కోసం ఏమైనా చేస్తారని హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్‍లో దందాలు చేసుకుంటుంటే మేము ఎప్పుడైనా ఇబ్బంది పెట్టామా? మీరంతా బాగుపడాలని అనుకునేవాళ్లమే మేమంతా. అలాంటిది మా తెలంగాణ ప్రజల నరదిష్టి తగిలే ఏపీలో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని పవన్ కల్యాణ్ అనడం ఎంతవరకు సబబో ఏపీ ప్రజలే చెప్పాలన్నారు. తనకు మోడీ, చంద్రబాబు నాయుడు క్లోజ్ అని అహంకారంతో మాట్లాడినట్లుగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. తన వ్యాఖ్యలపై పవన్ క్షమాపణలు చెప్పకుంటే సమయం వచ్చినట్లు తెలంగాణ ప్రజలు ఏకమవుతాయన్నారు.

Next Story