I Bomma: అతని ద్వారానే ఐ బొమ్మ రవిని ట్రాప్.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

by Prasad Jukanti |

ఐ బొమ్మ రవి కేసుకు సంబంధించి అడిషనల్ సీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కీలక విషయాలు వెల్లడించారు.

I Bomma: అతని ద్వారానే ఐ బొమ్మ రవిని ట్రాప్.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఐ బొమ్మ కేసులో (I Bomma Ravi) రవికి సంబంధించి పేలు కీలక విషయాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. రవిని ఐదు రోజుల పాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ (Additional CP Srinivas) ఈ కేసుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కీలక విషయాలు వెల్లడించారు. రవి సినిమాల పైరసీతో పాటే బెట్టింగ్ ప్రమోషన్ కూడా చేశారని గేమింగ్, బెట్టింగ్ యాప్ ద్వారా రవికి డబ్బులు వచ్చేవన్నారు. యాడ్ బుల్ అనే బెట్టింగ్ కంపెనీ రవికి చెందినదేనని ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బ వచ్చేదని తెలిపారు. రవి సర్వర్లన్నీ నెదరలాండ్స్‌లో ఉన్నాయని రవి టీం ఇంకా కరేబియన్ దీవుల్లోనే ఉందన్నారు. హైదరాబాద్‌, వైజాగ్‌లో రవి ఆస్తుల్ని గుర్తించాం. ఇప్పటిదాకా రూ.3 కోట్లు సీజ్‌ చేశామని చెప్పారు. రవి సోలో లైన్ జీవిస్తున్నారని అమెరికాలో ఆయన సోదరి ఉంటోంది. ఆమెకు గాని కుటుంబ సభ్యులకు గానీ రవి డబ్బులు పంపించినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదన్నారు. మరికొన్ని పైరసీ వెబ్‌సైట్లు నడుస్తూనే ఉన్నాయని మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ లాంటి పలు పైరసీ వెబ్‌సైట్లు నడుస్తున్నాయని చెప్పారు. వీటి నుంచి రవి సినిమాలను సేకరించేవాడని తెలిపారు. వాటి క్వాలిటీ సరిగా లేకుంటే క్వాలిటీ పెంచుకునే సాఫ్ట్ వేర్ కూడా రవి వద్ద ఉందన్నారు.

రవిని పట్టించింది భార్య కాదు.. అతని వల్లే పట్టుకున్నాం:

రవిని పోలీసులు పట్టుకోవడం వెనుక అతడి భార్య టిప్ అందించారని వస్తున్న సమచారారాన్ని అడిషనల్ సీపీ ఖండించారు. రవి భార్య మాకు ఇప్పటి వరకు కాంటాక్ట్ లో లేరని నిజానికి రవి మాకు దొరుకుతాడనే గ్యారెంటీ కూడా లేకుండేనని చెప్పారు. పోలీసులకు రవి చాలెంజ్ చేశాక ఒక్కొ లీడ్ ను విశ్లేషించుకుంటూ వెళ్తున్న క్రమంలోరవికి నిఖిల్ అనే మిత్రుడు ఉన్నాడని అతడి నంబర్ మాకు దొరికిందని దాన్ని విశ్లేషించడం ద్వారా రవి దొరికాడన్నారు. ఐ బొమ్మ, బొప్పం వెబ్ సైట్ కు ఈ నిఖిల్ డిజైన్లు చేశారని తెలిపారు. రవిని పట్టుకోవడం వెనుక పోలీసుల కృషి మాత్రమే ఉందని ఎవరు మాకు సమాచారం ఇవ్వలేదన్నారు. సోషల్ మీడియాలో రవికి వస్తున్న మద్దతు తమకు తెలియదని సీపీ చెప్పారు. రవికి మద్దతు తెలుపుతున్నారనే వారు ఐ బొమ్మలో ఉచితంగా సినిమాలు చూడవచ్చు. ఒక సినిమా చూస్తే రూ. వెయ్యి పోతుందేమో కానీ మీ లక్షల విలువైన వ్యక్తిగత డాటా వారి చేతుల్లోకి వెళ్తోందని ఇది గమనించాలన్నారు. రవి ప్రతివారం ఒక్కో దేశానికి ట్రావెల్ చేసేవాడని అతనికి జాబ్ చేసే ఉద్దేశం లేదని ఈజీ మనీ కోసమే ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తమతో చెప్పాడన్నారు. రవిపై ఉన్న మిగతా కేసులపై పీటీ వారెంట్ వేస్తామన్నారు. ఒక సందర్భంలో గెట్టింగ్ అప్ అనే యాప్‍లో హోస్టింగ్ కు సంబంధించి సైబర్ ఇన్ స్పెక్టర్ మెయిల్ పెడితే దానికి రవినే బ్యాక్ ఎండ్లో సమాధాం ఇచ్చారని సీపీ తెలిపారు. అయితే మీ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయని తమనే ప్రశ్నించాడు. దాంతో తమకు సందేహం కలిగి రివర్స్ ఇంజనీరింగ్ చేయడంతో అతడు దొరికాడన్నారు.

మూడు బొమ్మల్లో 'ఐ బొమ్మ':

బొమ్మ, బప్పం వెబ్ సైట్ల డొమైన్లను రవి తన క్రెడిట్ కార్డు, ఈమెయిల్ ఐడీలను ఉపయోగించాని పోలీసులు తెలిపారు. దీని వల్ల ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్లు తనవి కాదని తప్పించుకోలేదన్నారు. ఐబొమ్మలో సినిమా చూద్దామని వెళ్తే ఓపెన్ చేసే యూజర్లను గేమింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లకు రీడైరెక్షన్ చేస్తారని అలా ఏర్పడిన ట్రాఫిక్ తో యాడ్ అడ్వర్టేజ్ క కంపెనీలు రవికీ చెందిన యాడ్ బుల్ కంపెనీకి డబ్బులు చెల్లించేవని వెల్లడించారు. ఇలా రవి ఐ బొమ్మకు వచ్చిన యూజర్లను బలవంతంగా గేమింగ్, బెట్టింగ్ యాప్ లకు రీడైరెక్షన్ చేసి డబ్బులు సంపాదించాడని తెలిపారు. రవి డివైజ్ లలో మిలియన్ల కొద్ది బైట్ల డేటా ఉందని వాటిని రిట్రీట్ చేసి అనాలసిస్‍కు చాలా టైమ్ పడుతుందన్నారు. ఇలా మూడు దశల్లో రవి యూజర్లను ఉపయోగించుకుని క్యాష్ చేసుకున్నాడని తెలిపారు.

Next Story