BREAKING: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ సోదాలు.. టార్గెట్ గోల్డ్ షాప్ యజమానులు

by Naga Rani Yarlagadda |

ఐటీ అధికారులు మరోసారి హైదరాబాద్ లో సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు.

BREAKING: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ సోదాలు.. టార్గెట్ గోల్డ్ షాప్ యజమానులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ అధికారులు మరోసారి హైదరాబాద్ లో సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన క్రమంలో.. నగరంలోని గోల్డ్ షాప్ యజమానుల ఇళ్లల్లో బుధవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో 15 టీమ్ లతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని బంగారం వ్యాపారి జగదీష్ ఇంటిలో ఐటీ అధికారులు రైడ్ చేశారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు, లెక్కకు మించిన ఆస్తులు, నగలు ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. మరోవైపు వరంగల్ లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఐటీ దాడులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story