- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్
అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) రైడ్స్ సంచలనం రేపుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు.. రెండవ రోజు కూడా తనిఖీలు

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) రైడ్స్ సంచలనం రేపుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు.. రెండవ రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండే అధికారులు ముమ్మరంగా సోదాలు మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో 18 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. మహేశ్వరం నియోజవర్గ కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇంట్లో రెండవ రోజు తనిఖీలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగడం హాట్ టాపిక్‌గా మారింది.






