- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ఆఫీస్‌కు ఫుట్‌బాల్ తీసుకెళ్లింది వాస్తవమే.. ఎంపీ కొండా కీలక వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీకి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా బహూకరించడం ఆ పార్టీలో హాట్ టాపిక్ మారింది.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీకి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా బహూకరించడం ఆ పార్టీలో హాట్ టాపిక్ మారింది. ఈ వ్యవహారంపై గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సోషల్ మీడియా వేదిక సంచలన వీడియో విడుదల చేశారు. రాబోయే రోజుల్లో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల్లోని సీనియర్ నేతలంతా పార్టీలోని బడా లీడర్లకు ఫుట్‌బాల్స్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అజాతశ్రతువుగా పేరున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy)కే ఫుట్‌బాల్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆయనలో ఎంత ఆవేదన ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గతంలో పార్టీలోని పెద్దలు తనతో కూడా ఫుట్‌బాల్ ఆడారని ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్ చేశారు.
అయితే, రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. తాను బీజేపీ కార్యాలయానికి ఫుట్‌బాల్ తీసుకెళ్లింది వాస్తవమేనని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎలా ఆడుకోవాలో చేప్పేందుకు సింబల్‌గా అలా చేశానని క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీ అగ్ర నేతలకు ఫుట్‌బాల్ ఇచ్చినట్లు ఫోటోలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అయినా, సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి చెడు అలవాట్లు లేవని.. ఆయనో ఫుట్‌బాల్ ప్లేయర్ అని గుర్తు చేశారు. ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయింది.. కాంగ్రెస్‌తోనే బీజేపీకి పోటీ అని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత కూడా ఆమె ఓటు పదేళ్లు అలాదే ఉందని అన్నారు. హైదరాబాద్‌లో కూడా ఒకే ఇంట్లో 72 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఆ విషయాన్ని తాను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశానని అన్నారు. అదేవిధంగా 2018, 2023 ఎన్నికల్లో తాను లక్షా 20 వేల నకిలీ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. కానీ, ఇప్పటికీ హైదరాబాద్ పరిధిలో ఫేక్ ఓట్లు అలాగే ఉన్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.






