- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్న తండ్రిని అలా అనడం తగదు.. కేసీఆర్‍పై కవిత వ్యాఖ్యలని ఖండించిన కాంగ్రెస్ నేతలు
కొత్త పార్టీ పెట్టిన కవిత తన తండ్రి కేసీఆర్‌ను 'రోబో' అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చగా మారాయి. కవిత తీరును కాంగ్రెస్ నేతలు తప్పుబట్టడం ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కవిత స్థాపించిన కొత్త పార్టీ హాట్‍టాపిక్‍గా మారింది. తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పేరుతో పార్టీని ప్రకటించిన కవిత.. ఆవిర్భావ వేడుకల్లో తన తండ్రి కేసీఆర్‍ను కార్నర్ చేశారు. కేసీఆర్ మన మనిషి కాదని ఆయన ఇప్పుడు మరమనిషిగా మారిపోయారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కన్నతండ్రిని పెట్టుకుని కవిత అంతలా మాట్లాడటం ఏంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఏకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్‍కు మద్దతుగా నిలవడం స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సొంత తండ్రిని రోబో అని అనడం తగదని ఇంతకంటే దయనీయమైన పదం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను అగౌరవపరచవద్దన్నారు. వ్యక్తిగతంగా మీకు ఎన్నైనా ఉండవచ్చు. మీ సొంత సమస్యలను రోడ్డున వేసుకున్నారు. ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన సమస్యను బయట వేసుకోవడమే కాకుండా కేవలం తన ఇంటివారినే అంటే బాగుండదనే ముఖ్యమంత్రిపై కూడా కవిత విమర్శలు చేస్తున్నారన్నారు. మీ కుటుంబం సమస్యలు మీరు తేల్చుకోండి తప్ప రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదన్నారు.
ఇది మంచి పద్దతి కాదు:
మరో కాంగ్రెస్ నేత రాములు నాయకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తండ్రినే కవిత విమర్శిస్తోందని ఇది మంచిపద్దతి కాదన్నారు. ఆ పెద్దాయనతో మాకు ఎన్నైనా విభేదాలు ఉండవచ్చు కానీ కన్నతండ్రిని పెట్టుకుని ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ లేకుంటే వీరెవరు అని ప్రశ్నించారు. కవిత 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. కవిత అసెంబ్లీకి వెళ్లాలనుకోవడం కల్లా అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు.
హాట్ టాపిక్‍గా కవిత వ్యాఖ్యలు:
పార్టీ ఆవిర్భావ సభలో కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటు కన్నతండ్రిపై సొంత అన్నపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కవిత కాంగ్రెస్, బీజేపీపై కూడా విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎవరిని మరింతగా టార్గెట్ చేయబోతున్నారు? కవిత పార్టీతో ఆమెకు లాభం ఏ మేరకు అనేదానితో పాటు ఎవరికి నష్టం కలగబోతోంది అనేది సైతం చర్చగా మారింది.






