రాష్ట్ర ప్రభుత్వానికి అదొక అలవాటుగా మారింది.. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్​ఎస్ ​ప్రభాకర్​

by Ramesh Goud |   (  Updated:2025-05-04 16:48:36  IST  )

కేంద్రంలో మోడీ సర్కార్ ​తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపుతోందని ఆరోపించడం గత సీఎం కేసీఆర్‌కు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అదొక అలవాటుగా మారింది.. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్​ఎస్ ​ప్రభాకర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రంలో మోడీ సర్కార్ ​తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపుతోందని ఆరోపించడం గత సీఎం కేసీఆర్‌కు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన ఇప్పటివరకు ఇచ్చిన హామీల ఒకటి అమలు చేయలేదని, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కోసం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు మంజూరు చేసింది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సహకారానికి నిరాకరణ చూపించడం పరిపాటిగా మారిందన్నారు.

కేంద్రం ప్రకటించిన విశ్వవిద్యాలయాలకు భూములు కేటాయించడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేసింది. విమానాశ్రయాలు, నవోదయ పాఠశాలల విషయంలో కూడా నిధులు మంజూరు చేసినా, వాటి కోసం భూములు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసిందని తెలిపారు. ఇటీవల ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ కోసం గతంలో మాజీ సీఎం కేసీఆర్‌ను భూమి కేటాయించాలని తాను పలుమార్లు కోరిన భూములు ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజావ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ విధానాలను వెంటనే విడనాడాలి. కేంద్రం ఇస్తున్న ప్రతి పైసాను సద్వినియోగం చేసే విధంగా, మ్యాచింగ్ గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. కేంద్రం నేరుగా రాష్ట్రానికి ఇచ్చే ప్రాజెక్టులకు భూములను కేటాయించి, అవసరమైన సహకారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ నైతిక బాధ్యతని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వ పథకాల అమలుకు, వివిధ ప్రాజెక్టులకు సహాయనిరాకరణ చేస్తూ, అభివృద్ధి అడ్డంకిగా మారుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

Next Story