- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్రటేరియట్‌కు స్మార్ట్ ఎంట్రీ.. విజిటర్స్‌కు హైటెక్ భద్రత
వివిధ పనుల కోసం సెక్రెటేరియట్‌లోనికి వచ్చే విజిటర్స్‌కు ఈ-పాస్‌లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఐటీ శాఖ ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్‌ను డిజైన్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ పనుల కోసం సెక్రెటేరియట్‌లోనికి వచ్చే విజిటర్స్‌కు ఈ-పాస్‌లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఐటీ శాఖ ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్‌ను డిజైన్ చేసింది. ఆ పోర్టల్‌లో విజిటర్స్‌కు సంబంధించిన డిటెయిల్స్ ఎంటర్ చేయగానే, సంబంధిత వ్యక్తి స్మార్ట్ ఫోన్‌కు క్యూఆర్ కోడ్ వెళ్తుంది. సెక్రటేరియట్ లోనికి వచ్చే ముందు విజిటర్స్ ఎంట్రీ గేట్ వద్ద ఆ కోడ్‌ను చూపించగానే అక్కడున్న సెక్కూరిటీ స్టాఫ్ స్కానింగ్ చేసిన తరువాతే లోనికి అనుమతి ఇచ్చేవిధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న రెగ్యులర్ విజిటింగ్ హవర్స్‌ను యథావిధంగా అమలు చేయనున్నారు.
మూడు శాఖల సమన్వయంతో ప్రత్యేక సాఫ్ట్ వేర్
ఈ-పాస్ సాఫ్ట్ వేర్‌ను ఐటీ శాఖ పర్యవేక్షణలో తయారు చేశారు. అందుకు జీఏడీ, ఎస్పీఎఫ్ అధికారులు (సెక్రెటేరియట్ భద్రత పర్యవేక్షణ చేస్తోన్న పోలీస్ వింగ్) సలహాలు, సూచనలు తీసుకున్నారు. విజిటర్స్‌ను లోనికి అనుమతి ఇచ్చేందుకు ప్రతి మంత్రి,సెక్రెటరీ పేషీకి పోర్టల్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను అందిస్తారు. ఆ పోర్టల్ లోనికి లాగిన్ అయిన తరువాత తమ పేషీకి వచ్చే విజిటర్ పేరు, చిరునామా, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. వెంటనే విజిటర్ ఫోన్‌కు క్యూఆర్ కోడ్ వెళ్తుంది. ఆ కోడ్‌ను సెక్రెటేరియట్ ఎంట్రీ గేట్‌లో చూపించాలి. అయితే ఆ కోడ్‌ను స్కానింగ్ చేసేందుకు సెక్యూరిటీ స్టాఫ్ కోసం ప్రత్యేకమైన యాప్‌ను తయారు చేశారు. విజిటర్ గేట్ వద్ద డ్యూటీలో ఉన్న సెక్కూరిటీ స్టాఫ్ యాప్ ఓపిన్ చేసి, కోడ్‌ను స్కానింగ్ చేయగానే విజిటర్ డిటెయిల్స్ డిస్ ప్లే అవుతాయి. వాటిని క్రాస్ చెక్ చేసుకున్న తరువాతే విజిటర్‌ను లోనికి అనుమతి ఇస్తారు.
అకౌంటబిలిటీ కోసమే ఈ-పాస్?
సెక్రెటేరియట్‌లో విజిటర్స్ అవర్స్ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో విజిటర్స్ మంత్రులు, అధికారుల వద్దకు వెళ్లేందుకు రిసెప్షన్ సెంటర్‌లో ఆధార్ కార్డును చూపిస్తే పాసులు జారీ చేస్తున్నారు. అయితే విజిటర్స్ అవర్స్‌తో సంబంధం లేకుండా ఉదయం 10 గంటల నుంచే చాలా మంది మంత్రులు, సెక్రెటరీల పేషీల నుంచి సెక్కూరిటీ స్టాఫ్‌కు ఫోన్ చేసి, తమకు సంబంధించిన వ్యక్తులను లోనికి పిలిచుకుంటున్నారు. దీనితో రోజుకు ఎంత మంది విజిటర్స్ లోనికి వెళ్తున్నారో లెక్కలు ఉండటం లేదు. అలాగే విజిటర్స్ సంబంధించిన వివరాలు సైతం మంత్రులు, సెక్రెటరీల పేషీల వద్ద ఉండటం లేదు. అందుకని ఈ -పాస్ అమలు చేయడంతో ఏ పేషీ నుంచి విజిటర్‌కు క్యూర్ కోడ్ వెళ్లింది? ఒక పేషీ నుంచి రోజుకు ఎంత మందికి పాస్‌లు జారీ చేసింది ? సెక్రెటేరియట్ లోనికి ప్రతి రోజు ఎంత మంది వస్తున్నారు? అనే పూర్తి స్థాయి డిటెయిల్స్ జీఏడీ అధికారుల వద్ద నమోదు అవుతాయి.
నాలుగు శాఖల్లో ట్రయల్ రన్ చేస్తున్నాం
ఈ-పాస్ అమలు వల్ల సెక్రెటేరియట్ లోనికి వచ్చే విజిటర్స్ సంఖ్యపై క్లారిటీ ఉంటుంది. ఎవరి అనుమతితో విజిటర్ లోనికి వచ్చారో అనే సమాచారం తమ వద్ద ఉంటుంది. ప్రస్తుతం ఈ-పాస్ సిస్టమ్ ట్రయల్ రన్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఐటీ, హెల్త్ మినిస్టర్ పేషీలు, అలాగే ఎడుకేషన్, హెల్త్ సెక్రెటరీ పేషీల్లో అమలు చేస్తున్నాం.
- దేవీదాస్, సెక్రటేరియట్ చీఫ్ సెక్కూరిటీ ఆఫీసర్






